అమ్మ సమాధి దగ్గర కానిస్టేబుల్ ఆత్మహత్య...

 

తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి దగ్గర.. ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. మధురైకి చెందిన అరుల్ అనే వ్యక్తి మెరీనా తీరం వద్ద ఉన్న సమాధి వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈరోజు కూడా డ్యూటీ చేసే నిమిత్తం సమాధి వద్దకు చేరుకున్న అరుల్, తన రైఫిల్ తో కాల్చేసుకున్నాడు. ఈ సంఘటనతో వెంటనే అప్రమత్తమైన డ్యూటీలో వున్న మిగిలిన పోలీసులు, అతన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అరుల్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.