TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జయలలిత మృతిపై ఎయిమ్స్ రిపోర్ట్...

Published on: Mon Mar 6, 2017 4:35PM

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పై ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమ్మ మరణంపై ఎయిమ్స్ వైద్యులు నివేదికను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. జయలలిత అనారోగ్యానికి గురైన సమయంలో ఎయిమ్స్ వైద్యులు కూడా ఆమెకి చికిత్స చేశారు. దాదాపు అయిదారుసార్లు చెన్నైకి వెళ్లి.. ఆమెకు చికిత్స‌ను అందించారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ వైద్యులు విశ్లేష‌ణాత్మ‌క నివేదిక తయారు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ సందర్భంగా ఎయిమ్స్ డిప్యూటీ డైర‌క్ట‌ర్ వీ. శ్రీ‌నివాస్ మాట్లాడుతూ... అధికారిక రికార్డు కోసం డాక్ట‌ర్ల వివారాల‌ను తెలుసుకునేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రిపోర్ట్ సేక‌రించింద‌ని తెలిపారు. ఎయిమ్స్ వైద్యుల నివేదిక‌ను త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాధాకృష్ణ‌న‌న్‌కు అంద‌జేశారు.