జయలలితతో అద్వానీ,నరేంద్రమోడీ సమావేశం
Published on: Sun Jan 15, 2012 11:39AM
తమిళనాడు:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమ సహజ భాగస్వామి అని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ అన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చో.రామస్వామి సంపాదకత్వంలో వెలువడుతున్న 'తుగ్లక్' వారపత్రిక 42వ వార్షికోత్సవం శనివారం రాత్రి చెన్నయ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, సూపర్‌స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ఆమె నేతృత్వంలోని అన్నాడీఎంకే, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ ఆ పార్టీని మా సహజ భాగస్వామిగానే పరిగణిస్తున్నామని చెప్పారు.ఈరోజు జయలలితతో అద్వానీ,నరేంద్రమోడీ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.


