TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుమారం రేపుతున్న షాహిద్‌ ఆఫ్రిది వ్యాఖ్యలు

Published on: Mon Mar 14, 2016 4:46PM

పాకిస్తాన్‌లో కంటే తమను ఇక్కడి భారతీయులే ఎక్కువగా అభిమానిస్తారంటూ ఆ దేశ టి-20 కేప్టెన్ షాహిద్‌ ఆఫ్రిదీ చేసిన వ్యాఖ్యలు, తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే, ఈ వ్యాఖ్యలను ఖండించేందుకు ఆ దేశ మాజీ కేప్టెన్‌ జావేద్‌ మియాందాద్‌ ముందుకు వచ్చాడు. భారత దేశం అంటే ఎప్పుడూ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే మియాందాద్‌కు ఆఫ్రిది మాటలు మంట పుట్టించినట్లున్నాయి. ‘ఇలాంటి మాటలు అనడానికి సిగ్గుపడాలనీ, భారత్‌లో అడుతున్నంత మాత్రాన ఆ దేశాన్ని పొగడాల్సిన అవసరం లేదని’ మియాందాద్‌ దుయ్యపట్టాడు.

భారత దేశంలో విధ్వంసాన్ని సృష్టించి పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న దావూద్‌ ఇబ్రహీంతో వియ్యమందుకున్న మియాందాద్‌, ఆఫ్రిది మాటలకు తనను గాయపరిచాయని వాపోయాడు. అంతేకాదు! ‘పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలనీ, ఆటగాళ్లు విదేశాలకు వెళ్లే ముందు వారికి తగిన హెచ్చరికలు చేసి పంపాలనీ’ సూచించాడు. గత ఐదేళ్లుగా ఇండియా, పాకిస్తాన్‌కు ఏమీ ఇవ్వలేదనీ... అలాంటి దేశాన్ని పొగడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు మియాందాద్‌. ఇంతకీ పాకిస్తాన్‌కు, ఇండియా ఏం ఇవ్వాలో చెప్పనేలేదు!