జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సొరేన్ కన్నుమూత
posted on: Aug 16, 2025 10:00AM
.webp)
జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి రాందాస్ సోరెన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. ఈనెల 2న తన నివాసంలోని బాత్ రూంలో జారిపడిన ఆయన తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఆయనను ఎయిర్ అంబులెన్స్ లో అప్పడే హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. అప్పటి నుంచీ ఢిల్లీలోని ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 15) అర్థరాత్రి దాటిన తరువాత తుదిశ్వాస విడిచారు.
Latest YouTube Trending Video NEWS


.webp)



