Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జపాన్ ప్రధాని రాజీనామా...ఎందుకంటే?
posted on: Sep 7, 2025 5:36PM

జపాన్ దేశ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచరం. అక్టోబర్లో జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువసభలో అధికార సంకీర్ణ సర్కారు మెజారిటీని సాధించలేకపోయింది.
అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దాంతో సొంత పార్టీ సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై సెప్టెంబర్ 8న చర్చించి నిర్ణయం తీసుకునేందుకు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం నిర్వహించిన ఇషిబా.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకుగాను ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు చెప్పారు.


.webp)



