TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనవరి 15న శ్రీరాములు న్యూ పార్టీ

Published on: Mon Jan 2, 2012 8:46AM

బెంగళూరు: జనవరి పదిహేనవ తారీఖున తాను నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు బళ్లారి రూరల్ శాసనసభ్యుడు శ్రీరాములు  తెలిపారు. బడవర శ్రామికర రైతర(బిఎస్సార్) పేరిట పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.పేదలు, శ్రామికులు, రైతుల హక్కుల కోసం పోరాడేందుకు పార్టీని ప్రారంభిస్తున్నామని, తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమన్నారు.పదిహేనవ తారీఖున పార్టీ ప్రకటించిన తర్వాత విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాలకు, ఇరవై ఎనిమిది పార్లమెంటు స్థానాలకు పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తల్లి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా తాను బిజెపిలోనే కొనసాగుతానని, కొత్త పార్టీలో చేరబోనని గాలి సోదరుడు కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉన్న గాలిని భార్య, పిల్లలు శనివారం కలుసుకున్నారు. గాలిని జైల్లో భార్య, కుమార్తె, కుమారుడు పరామర్శించడం ఇదే తొలిసారి.