జాని మాస్టర్ అక్టోబర్ 3 వరకు రిమాండ్
Published on: Sat Sep 28, 2024 2:25PM
.webp)
పోలీస్ కస్టడీతో శనివారంతో ముగియడంతో కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ ను రంగారెడ్డి కోర్టుకు హాజరుపరిచారు. పోలీస్ కస్టడీని కొనసాగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. జాని మాస్టర్ ను అ క్టోబర్ మూడు వరకు చెంచల్ గూడా జైలుకు తరలించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. మహిళా అసిస్టెంట్ పై రేప్ కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 25న నాలుగురోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం శనివారం ఆ గడువు ముగిసింది. మరో మారు పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.


