TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 జాని మాస్టర్ కు బెయిల్ వచ్చేనా ?

Published on: Thu Sep 19, 2024 11:34AM

 ప్రముఖ కొరియాగ్రాఫర్ జాని మాస్టర్ ను ఎస్ ఒటి పోలీసులు బెంగుళూరులో అరెస్ట్ చేశారు .  జాని మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ 21 ఏళ్ల మహిళా కొరియాగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదైన నేపథ్యంలో  జాని తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్, నెల్లూరులో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు జాని మాస్టర్ బెంగుళూరులో చిక్కాడు. అతన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. జాని మాస్టర్ పై పోక్సో , నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇదిలా వుండగా బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు కక్ష్య పూరితంగా ఇచ్చినట్లు  వార్తలు వెలువడుతున్నాయి. జాని మాస్టర్ భార్య కూడా తనను శారీరకంగా హింసించేది అని  యువతి ఫిర్యాదులో పేర్కొంది.  మతం మార్చుకుని తన భర్తను పెళ్లి చేసుకోవాలని కంప్లైంట్ కాపీలో ఆ యువతి పేర్కొంది. ఈ ఆరోపణలను జాని మాస్టర్ భార్య ఖండించారు. జాని మాస్టర్ పై సెక్స్ ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది.  జాని మాస్టర్ కు  ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని న్యాయనిపుణులు పేర్కొన్నారు