TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈనెల 28న జెండా పాటలు

Published on: Mon Dec 23, 2013 1:40PM

 

నాని, అమలాపాల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "జెండాపై కపిరాజు". ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. ఆడియోను ఈనెల 28న హైదరాబాద్ లొని శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. రాగిణి ద్వివేది మరో హీరోయిన్ గా నటిస్తుంది. వాసన్ విసువల్ వెంచర్స్ బ్యానర్లో కె.ఎస్.శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని రెండు రకాల పాత్రలలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు.