TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 కల్తీ లడ్డూపై జనసేన అగ్రహం...జగన్ దిష్టిబొమ్మ దహనం

Published on: Sat Sep 21, 2024 3:56PM

తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. తిరుపతిలో కల్తీ లడ్డూ తయారీకి పాల్పడ్డ  గత వైసీపీ ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. 
తిరుపతి లడ్డూ కల్తీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో జరిగిన ఈ కల్తీ గూర్చి విని భక్తులు మనోవేదనకు గురయ్యారు.  పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.  కమిషన్లకు కక్కుర్తిపడ్డ వైసీపీ నాయకులు ఈ కల్తీకి పాల్పడ్డారని జనసేన నేతలు అంటున్నారు. వైసీపీ నేతల దిష్టి బొమ్మలను జనసేన నేతలు చెప్పులతో కొట్టి దహనం చేశారు. జగన్ దిష్టి బొమ్మను వారు రహనం చేశారు. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు పలువురు జనసేనలో చేరిన నేపథ్యంలో జనసేననేతల చేపట్టిన ఈ ఆందోళన వల్ల కూటమి మరింత బలోపేతమైంది.