తెలంగాణ అయిపోయింది.. ఇక ఏపీ బాట

జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జనం సమస్యలను తెలుసుకునేందుకు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో చలోరె చలోరె చెల్ యాత్ర పేరిట మూడు రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కార్యకర్తలతో సమావేశమై పార్టీ సిద్దాంతాలు, ఆశయాలను వారికి వివరించారు. ఇప్పుడు ఈ యాత్రను ఆంధ్రప్రదేశ్‌లోనూ చేయాలని పవన్ భావించారు. దీనిలో భాగంగా రేపు అనంతపురంలో కరువుపై అధ్యయనం చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారని ఈ రోజు ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ పేరిట ప్రకటన విడుదలైంది. ఈ నెల 28న పవన్ కళ్యాణ్ కదిరికి వెళతారని.. అనంతరం పుట్టపర్తి, ధర్మవరం, చిక్బల్లాపూర్లలో ఈ నెల 29న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ప్రకటనలో తెలిపారు.