ఎన్ కౌంటర్ జరిగే చోటుకు రావద్దు...

 

జమ్మూ కాశ్మీర్ లో తరచూ కాల్పులు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యంలో.. స్థానికుల గుంపు భద్రతా బలగాలపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర డీజీపీ ఎస్.పి.వైద్ కొన్ని సూచనలు చేశారు. ఎన్ కౌంటర్ జరిగే చోటకు వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వే యువకులు అనవసరంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని..ఎన్ కౌంటర్ జరిగే చోటకు రావద్దని రాజకీయ ప్రయోజనాల కోసం వారిని కొందరు వినియోగించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరు వస్తున్నారు, ఎవరికి తగులుతుంది? అన్నది బుల్లెట్ చూడలేదు. ఎన్ కౌంటర్ జరిగే చోట పోలీసులు సైతం తమకు రక్షణగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇళ్లను అండగా చేసుకుంటారు. కానీ, యువకులు మాత్రం రాళ్లు రువ్వేందుకు వచ్చి ప్రాణాలను పణంగా పెడుతున్నారు’’  అని వైద్ అన్నారు.