భారత్ ప్రతీకారం... పాక్ రేంజర్లు హతం...
Published on: Thu Mar 1, 2018 12:01PM

సరిహద్దు ప్రాంతంలో పాక్ నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు కాల్పులు జరిపి... సరిహద్దుల్లో కల్లోలం సృష్టించి.. భారత సైనికులను కిరాతకంగా హతమార్చుతూనే ఉంది. అయితే ఇప్పుడు పాక్ ఆర్మీపై భారత జవాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు. మరోవైపు, బందిపొరాలో జరిగిన ఎన్ కౌంటర్లో ఓ ఉగ్రవాదిని సైనికులు మట్టుబెట్టారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందటంతో... అక్కడకు వెళ్లిన సైనికులు ఆ ఉగ్రవాదిని కాల్చి చంపారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.


