TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఎమ్మెల్యే ఎస్కార్ట్ పై కాల్పులు..

Published on: Thu Mar 23, 2017 2:56PM

 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.  ఎమ్మెల్యే ఎస్కార్ట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ నుంచి షోపైన్ కు ఎమ్మెల్యే మహ్మద్ యూసఫ్ వెళుతుండగా... ఆయన ఎస్కార్ట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, ఎమ్మెల్యే ఉన్న వాహనం బుల్లట్ ప్రూఫ్ కావడంతో, ఆయనకు ఏమీ కాలేదు. అయితే, ఎస్కార్ట్ లోని వాహనాలు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు.