TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాదులు మృతి..

Published on: Wed Mar 15, 2017 3:18PM

 

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కలరూస్‌ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కలరూస్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ఇంకా ఒక పోలీసు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.