TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కాల్పుల కలకలం... ఉగ్రవాది హతం..

Published on: Thu Mar 9, 2017 9:22AM

 

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పడ్గంపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీనిలో భాగంగానే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్టు సమాచారం. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని ఆర్మీ ద‌ళాలు చుట్టుముట్టాయి. గ్రామం చుట్టు ఉన్న దారుల‌ను మూసివేశారు.