జల్లికట్టుపై వెంకయ్యనాయుడు... వివాదం సృష్టిస్తున్నారు...

 

జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ.. తమకు శాశ్వత పరిష్కారం కావాలంటూ చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర విద్యార్ధులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు కాస్త ఈరోజు ఉద్రిక్తంగా మారాయి. నిరసన కారులు ఏకంగా పోలీస్ స్టేషన్ ను.. వాహనాలకు నిప్పంటించి ధ్వంసం చేశారు. ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి జల్లికట్టు వివాదంపై తమిళనాడు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అంతేకాదు కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు రాజకీయ లబ్ధికోసం జల్లికట్టును వాడుకుంటున్నాయని.. తమిళనాడు ప్రజల సంప్రదాయ క్రీడ విషయంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చినప్పటికీ వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 2009లోనే మద్రాస్‌ హైకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించిందని, కాంగ్రెస్‌ హయాంలో ఆంక్షలతో కూడిన అనుమతులు తెచ్చుకున్నారని వెంకయ్య గుర్తుచేశారు. జల్లికట్టు వివాదానికి డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు బాధ్యత వహించాలన్నారు.