జల్లికట్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్...

 

ఒకపక్క జల్లికట్టుపై సుప్రీంకోర్టులో నిషేదం ఎత్తివేయాలని తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంటే మరోపక్క సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జల్లికట్టుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి మేనకాగాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జల్లికట్టు క్రీడ వల్ల మూగ జంతువులు అంతులేని బాధను అనుభవిస్తాయని పిటిషన్ లో తెలిపారు. జంతువుల హక్కులను కాపాడాలని కోర్టును కోరారు.

 

ఇదిలా ఉండగా జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ సరిపోదని... చట్టం చేయాలని కోరుతూ ఓవైపు తమిళనాడులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ ఆందోళనలు ఈ రోజు హింసాత్మక రూపం దాల్చాయి. చైన్నైలో రెచ్చిపోయిన నిరసనకారులు, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.