జల్లికట్టుపై మద్రాసు కోర్టు.. మేం జోక్యం చేసుకోలేం..

 

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఆటపై నిషేదం విధించినా... పండుగ నేపథ్యంలో అక్కడక్కడ ఈ ఆటను నిర్వహించారు. అయితే ఇప్పుడు జల్లికట్టుపై మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘జల్లికట్టు’పై కొనసాగుతున్న నిషేధం విషయమై తాము జోక్యం చేసుకోబోమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించింది కనుక తాము ఇక జోక్యం చేసుకోలేమని పేర్కొంది. జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద యువత పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. అయితే, శాంతియుతంగా చేస్తున్న ఈ ఆందోళనలో విద్యుత్తు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ బాలు అనే న్యాయవాది, మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు పైవిధంగ వ్యాఖ్యానించింది.