TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అదేం భాష జక్కంపూడీ!

Published on: Wed Jul 27, 2022 12:15PM

తూర్పుగోదావరిజిల్ల రాజానగరం యం.ఎల్.ఎ జక్కంపూడి రాజా నిన్న జనసేన,వీర మహిళా నాయకులతో మాట్లాడిన మటల తీరు ఇప్పుడు చర్చనీయంశం  అయింది. వరద ప్రభావిత ప్రాంతలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ని కలిసి వరదభాదితులకి  పదివేల రూపాయల చొప్పున సహాయం అందించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు జనసేన నిర్ణయించింది. అయితే వారెవరూ జగన్ ను కలవకుండా పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ  తీసుకున్నారు. జనసేన నేతలు కొందరికి ‘ముందస్తు’ హౌస్ అరెస్టులు చేశారు  

ఐతే మిలిగిన  నాయకులూ,జనసేన వీర మహిళలు ముఖ్యమంత్రి వెళ్ళాకా గంటి పెదపూడి లో  జక్కంపూడి రాజా వాహనాన్ని అడ్డుకుని  నినాదాలు చేసారు. వరద భాదితులని ఆదుకోవడంలో ప్రభుత్వం  విఫలమైందని నిరసన వ్యక్తం చేసారు. తన వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడాన్ని సహించలేకపోయిన జక్కంపూడి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసభ్యంగా మాట్లాడారని మహిళలు ఆరోపిస్తున్నారు.  

జక్కంపూడి భాష మార్చుకోవాలని జనసేన వీరమహిళలు హెచ్చరించారు. నిరసనను ఉధృతం చేశారు.   వీరమహిలలని అదుపులోకి తీసుకున్నారు.  అయితే  జక్కంపూడి  భాష పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే జక్కంపూడి ఈ విధమైన దుడుకు వ్యవహారం ఇదే మొదటి సారి కాదని  అంటున్నారు. పోలవరంలో ప్రభుత్వ ఇంజనీర్ పై కూడా చెయ్య చేసుకున్న సంఘటనను గుర్తు చేస్తున్నారు.