TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జైషే అధినేత మసూద్ అజర్ సోదరుడుతాహిర్ అన్వర్ మృతి

Published on: Tue Mar 31, 2026 9:49AM

భారత్‌  లక్ష్యంగా పలు ఉగ్రదాడులకు పాల్పడిన కరుడుగట్టిన ఉగ్రవాది, పాకిస్థాన్ కు చెందిన   జైషే మహమ్మద్  ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అయిన మసూద్ అజార్ సోదరుడు హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  హకీమ్ మహ్మద్ తాహిర్  సోమవారం   తుదిశ్వాస విడిచాడు.

అనారోగ్యం కారణం అని చెబుతున్నప్పటికీ  హకీమ్ మహ్మద్ తాహిర్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇలా ఉండగా తన సోదరుడు తాహిర్ అన్వర్ మరణించినట్లు మసూద్ అజర్  ధృవీకరించారు. తన ప్రియమైన అన్నయ్య ఒక లేరంటూ ఆయన సంతాపం తెలిపినట్లుగా సోషల్ మీడియా పోస్టులు పేర్కొన్నాయి.  పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జామియా ఉస్మాన్-ఓ-అలీ మదర్సా తాహిర్ అన్వర్ అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం.  

తాహిర్ అన్వర్ జైషే మహమ్మద్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించేవాడు. . ముఖ్యంగా సంస్థకు చెందిన సాయుధ క్యాడర్‌కు నాయకత్వం వహించడంతో పాటు ఉగ్రవాదులకు శిక్షణ,  ఆశ్రయం కల్పించే పనులలో కీలకంగా వ్యవహరించేవాడు.  గత ఏడాది ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సమయంలో మసూద్ అజర్ కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. అప్పుడే తాహిర్ అన్వర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడనీ, అప్పటి నుంచీ అతడు కోలుకోలేదనీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అప్పటి గాయాలతోనే మరణించాడని అంటున్నారు. ఇలా ఉండగా తాహిర్ అన్వర్ మరణాన్ని పాకిస్థాన్ ఇంకా ధృవీకరించలేదు.