మరోసారి చిక్కుల్లో భోజ్‌పురి నటుడు రాజా
Published on: Sat Feb 4, 2012 9:34AM
జైపూ
ర్: ఎప్పుడూ ఏదో గొడవ చేసే భోజ్‌పురి నటుడు రాజా చౌదరి మరోసారి చిక్కుల్లో పడ్డారు. జైపూర్‌లోని జెఎల్ఎన్ రోడ్డులోని ఆస్పత్రి బయట గొడవకు దిగిన ఆయనను పోలీసులు గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దుష్ప్రవర్తనకు గాను ఆయన ఇది వరకు పలు మార్లు అరెస్టయ్యారు. గొడవలకు గాను ఆయన 2011లో ఏడాది పాటు ముంబై నుంచి బహిష్కరణకు గురయ్యారు. వరుసగా హెచ్చరికలు చేసినప్పటికీ ఆయన తన ప్రవర్తనను మార్చుకోవడం లేదు.
నటి శ్వేత తివారి మాజీ భర్త అయిన రాజా నిరుడు నటిగా మారిన మోడల్ వివేక్ మిశ్రాపై దాడి చేసినందుకు గాను వార్తల్లోకి ఎక్కారు. రాజా తాగి ఉన్నాడని, పర్వీనా అనే అమ్మాయితో ఆయన కలిసి ఉన్నాడని చెబుతున్నారు. గార్డు వారిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. దాంతో చిర్రెత్తిన రాజా రోడ్డుపైకి వచ్చి పెద్దగా అరవడం మొదలు పెట్టారు. అది చూసినవారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రాజాను అదుపులోకి తీసుకున్నారు. రాజా రాత్రంతా జవహరి సర్కిల్ పోలీసు స్టేషనులో ఉండిపోయాడు. మర్నాడు పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్‌పై విడుదలయ్యారు.


