TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అవసరాన్ని బట్టి పెట్రోల్‌ పంపుల లైసెన్స్లులు : జైపాల్‌రెడ్డి

Published on: Mon Jan 9, 2012 8:44AM

రంగారెడ్డి జిల్లా : జాతీయ స్థాయిలో అవసరాన్ని బట్టి పెట్రోల్‌ పంపులను మంజూరు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి తెలిపారు. తాండూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పెట్రోల్‌ పంపులు లాభదాయకంగా ఉంటాయంటేనే వాటిని మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కోవకు చెందిన పెట్రోల్‌ పంపులను ఏర్పాటు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా, అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు.తాండూరులో ప్రస్తుతం ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ ఉన్నా, ప్రజల అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని మరో గ్యాస్‌ ఏజన్సీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తాండూరులో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సంబంధించి కేటాయించిన 100 ఎకరాల స్థలంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రంగారెడ్డిలో ఆదర్శ రైల్వే స్టేషన్‌లకు సంబంధించి మంజూరైన నిధులతో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.