TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ అంశమే ప్రధానంగా జైపాల్ తో బొత్స

Published on: Sun Dec 18, 2011 3:53PM

హైదరాబాద్: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డితో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. వారు తాజా రాజకీయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. జైపాల్ రెడ్డి ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన బొత్స ఆయనతో భేటీ అవుతారు. అయితే వారి భేటీపై జోరుగా వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై త్వరలో ఓ స్పష్టమైన ప్రకటన చేస్తుందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి మధ్య తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.