జై సమైఖ్యాంధ్ర అన్న ఆర్. నారాయణమూర్తి
Published on: Sat Feb 25, 2012 2:56PM
హైదరా
బాద్: ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి నోట జై సమైఖ్యాంధ్ర నినాదాలు వినిపించాయి. ప్రత్యేక తెలంగాణాకు వీర మద్దతుదారుడైన నారాయణమూర్తి విజయనగరం జిల్లాలో సమైఖ్యవాదుల ఒత్తిడికి తట్టుకోలేక జై సమైఖ్యాంధ్ర అంటూ నినాదాలిచ్చారు. నారాయణమూర్తి విజయనగరం జిల్లా బొబ్బిలిలో పీపుల్స్ వార్ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు. ఇది తెలుసుకున్న సమైక్యవాదులు షూటింగ్ స్పాట్ కు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలిస్తూ తెలంగాణా మద్దతుదారుడైన నారాయణమూర్తి షూటింగ్ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. దీనికి నారాయణమూర్తి తిరస్కరించడంతో సమైక్యవాదులు కోపోద్రిక్తులై షూటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంచెందిన నారాయణమూర్తి నేనూ ఆంధ్రావాడినే అంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పరుషంగా కూడా మాట్లాడారు. దీంతో తెలంగాణాలో ఆంధ్రావాళ్ళ షూటింగ్ లను అడ్డుకుంటున్న అంశాన్ని సమైక్యవాదులు ప్రస్తావిస్తూ దీనికి మీరేం సమాధానం చెబుతారని నిలదీయడంతో నారాయణమూర్తి చేసేదేమీ లేక జై సమైక్యాంధ్ర అంటూ వెళ్ళిపోయారు.


