TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతి జూపార్క్ లో జాగ్వార్ మృతి

Published on: Wed Oct 8, 2025 8:17AM

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో వన్య ప్రాణుల మృత్యుఘోష ఆడగం లేదు. అసలు ఈ జూపార్క్ లో తరచూ వన్యమృగాలు ఎందుకు మృత్యువాత పడుతున్నాయన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. తాజాగా ఇదే జూపార్క్ లో  మంగళవారం (అక్టోబర్ 7) ఒక జాగ్వార్ ప్రమాదవశాత్తూ మరణించింది.  15 సంవత్సరాల వయస్సున ఈ జాగ్వార్ పేరు కుశ.  తిరుపతి శ్రీవేంకటేశ్వర జూపార్క్ కు మంగళవారం సెలవు. దీంతో ఈ పార్క్ లో ఆ రోజు కేవలం జూపార్క్ సిబ్బంది, వణ్యప్రాణుల సంరక్షకులు ఉంటారు. జాగ్వార్ మరణించిందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ విబాగం అధికారులు జూపార్క్ కు వచ్చి పరిశీలించారు. అనంతరం పశువైద్య విద్యాలయం డాక్టర్లు మరణించిన జాగ్వార్ కు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. 

2019లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి ఈ జాగ్వర్ ను తీసుకు వచ్చారు. మంగళవారం (అక్టోబర్ 7) యథావిధిగా జాగ్వార్ ను   విశాల మైదానంలో తిరగడానికి వదిలారు. అయితే కొద్ది సేపటి తరువాత  ఏం జరిగిందో ఏమో కానీ.. ఓ చెట్టుకు చిక్కుకుని మరణించి ఉండటం కనిపించింది.  పోస్టుమార్టం నివేదికలో హైపర్ షాక్, ఆస్పిసియాతో మరణించినట్లు తేలింది.