చిరంజీవి, పవన్ కోసం జగన్...!

 

నంద్యాల ఉపఎన్నికల్లో, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు ఎన్నికల్లో ఓడిపోగా.... త్వరలో జరగబోయే మరో మూడు ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం ఖాయమని.. మళ్లీ వైసీపీకి ఓటమి తప్పదని అంటున్నారు. దీంతో జగన్ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి... పార్టీని మరింత పటిష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించేందుకు వ్యూహాల‌ను సూచించాల‌ని ఇటీవ‌ల త‌మ పార్టీ రాజ‌కీయ నిపుణుడు ప్ర‌శాంత్ కిషోర్‌ని కోరిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇందులో భాగంగానే త్వ‌ర‌లో త‌మ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ద్ద‌తు కోర‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా పార్టీకార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం ఏర్ప‌రచి పార్టీ అభివృద్ధి కోసం ఓ క‌మిటీ ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉన్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుంది.. తానే కాబోయే సీఎం అని చెప్పుకున్న జగన్ కు నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు బాగానే షాకిచ్చినట్టు ఉన్నాయి. మరి జగన్ అయితే చిరంజీవి, పవన్ మద్దతు కోసం చూస్తున్నారు.. వాళ్లు జగన్ కు మద్దతు ఇస్తారో..?లేదో..? అసలు ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.