మెదక్ లోక్‌సభ స్థానం నుంచి జగ్గారెడ్డి?
Published on: Thu Aug 21, 2014 6:42PM

మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి జగ్గారెడ్డి సిద్ధపడుతున్నారని తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎదురొడ్డి నిలబడగల నాయకుడు జగ్గారెడ్డేనని కాంగ్రెస్ అధిష్టానం భావించడం వల్ల మెదక్ టిక్కట్ ఆయనకే దక్కే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక మెదక్ లోకసభ సీటు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పోటీకి దించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.


