Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్.. నువ్వెంత నీ బ్రతుకెంత?
posted on: Aug 8, 2025 6:50PM

బీఆర్‌ఎస్ నేత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కమీషన్లలో వాటా ఇవ్వలేదని జగ్గారెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏడ్చారని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభాకర్ రెడ్డి.. నీవ్వుంతా నీ బతుకెంతా?, వ్యక్తిత్వంలో నాతో సరిపోడు. నీ మాదిరిగా నేను ప్యాకేజీ ఇచ్చి బీ ఫామ్ తెచ్చుకోలేదు. బీఆర్ఎస్ 40 దొంగల్లో ప్రభాకర్ కూడా ఓ దొంగ'. అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు. పంచే గుణం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు.
నేను ఎలాంటి వాడినో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు. నేమైనా ప్యాకేజీల లీడర్ నా అంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.






