TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంగారెడ్డిలో చిన్నారులకు సైకిళ్లు అందజేసిన జగ్గారెడ్డి

Published on: Sat Jun 6, 2026 4:30PM

 

సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు. ఇప్పటికే 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, శనివారం మరో 210 మంది పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేసి వారి ఆనందానికి కారణమయ్యారు. స్థానిక పీఎస్ఆర్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్య క్రమంలో ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలకు ప్రత్యే కంగా సైకిళ్లు అందజేశారు. ప్రతి చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందించి వారిని ప్రోత్సహించారు. 

చిన్నారుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, అలాగే చదువుపై ఆసక్తి కలిగించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్య మని ఆయన తెలిపారు. గత వారం టోకెన్లు పొందిన చిన్నారులకు ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేశారు. టోకెన్లు పొందలేకపోయిన చిన్నారుల కోసం మరో విడత పంపిణీ చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. అందుకోసం చిన్నారుల ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. 

"సైకిల్ రాకపోయిందని ఏ చిన్నారి నిరాశ చెందవద్దు. పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సైకిల్ అందజేస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అక్కడికి వచ్చిన చిన్నా రులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం కొనసాగుతున్న ఈ కార్యక్ర మం స్థానికంగా విశేష ఆదరణ పొందుతోంది.