TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ వాళ్ళని బంతాడుకుంటా: జగ్గారెడ్డి

Published on: Wed Sep 10, 2014 10:37PM

 

మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ మీద, టీఆర్ఎస్ నాయకుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనను టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ద్రోహి అని విమర్శించినందుకు ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కెసిఆర్,హరీష్ రావుల జాగీరు కాదని ఆయన ధ్వజమెత్తారు. తాను త్వరలో అధికారంలోకి రాబోతున్నానని, అధికారంలోకి రాగానే టిఆర్ఎస్ నేతలను బంతాట ఆడుకుంటానని జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు.