అరెస్ట్ ఊహించా..17 వరకు రిమాండ్ సాయిరెడ్డి
Published on: Tue Jan 3, 2012 3:26PM
హై
దరాబాద్: జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయి రెడ్డి రిమాండ్ రిపోర్ట్ తనకు అందలేదని.. అరెస్ట్‌ను ముందే ఊహించానని మేజిస్ట్రేట్‌తో అన్నారు. తన తరపు న్యాయవాదితో మాట్లాడేందుకు గంటన్నర సమయాన్ని ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరడంతో అందుకు కోర్టు అనుమతించింది. రిమాండ్ రిపోర్ట్ లేకుండా కస్టడీలోకి సీబీఐ ఎలా తీసుకుంటుందని న్యాయవాది ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల పేర్లు వెల్లడించకుండా... అవినీతి నిరోధక చట్టం కింద కేసును ఎలా నమోదు చేస్తారని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది అన్నారు.
కాగా, విజయసాయిరెడ్డికి ఈనెల 17 వరకు నాంపల్లి సీబీఐ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. విజయసాయిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ పిటీషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరికాసేపట్లో విజయసాయిరెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.


