మా ఇద్దరికీ ఒకటే గొడవ
Published on: Wed Feb 12, 2014 2:41PM

జగపతిబాబు తన పుట్టినరోజు సందర్భంగా... ఆయన తనపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడుతూ... "చాలా సార్లు మీడియా వాళ్ళు నాకు పెళ్లి చేసారు. సౌందర్యతో నాకు చాలాసార్లు పెళ్లి చేసారు. అదే విధంగా ప్రియమణికి నాకూ ఎదో ఉందని రాస్తుంటారు. చాలా సినిమాల్లో సిఫార్సు చేసానని చెబుతారు. కానీ ప్రియమణికి ఎలాంటి సిఫార్సులూ అవసరం లేదు. నిజానికి మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. చాలాసార్లు గొడవ పడుతుంటాం. అంతెందుకు.. తనతో నేను మాట్లాడి చాలా రోజులైంది" అంటూ చాలా సున్నితంగా తెలిపారు.


