షరతులతో సీబీఐ కస్టడీకి విజయ సాయి
Published on: Thu Jan 5, 2012 9:58AM
హై
దరాబాద్ : జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని గురువారం ఉదయం సీబీఐ అధికారులు చంచలగూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన్ని దిల్కుషా అతిథిగృహంలో సీబీఐ విచారించనుంది. విజయసాయిరెడ్డిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని, న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు విచారణ పూర్తి అయిన వెంటనే చంచల్‌గూడ జైలుకి తరలించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది.


