TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాయిరెడ్డి నివాసంలో సోదాలు ..కీలక పత్రాలు స్వాధీనం

Published on: Tue Jan 3, 2012 9:04AM

హైదరాబాద్: జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ అధికారులు వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం మంగళవారం ఉదయం కోఠిలోని సిబిఐ కార్యాలయానికి తరలించారు. పదకొండు గంటల ప్రాంతంలో అతనిని కోర్టులో హాజరు పర్చే అవకాశం ఉంది. అతనిని సిబిఐ కస్టడీకి అడగనుంది. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ సోమవారం విజయ సాయి రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన తర్వాత సాక్షి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అనంతరం బంజారాహిల్స్‌లోని విజయ సాయి రెడ్డి నివాసం కృష్ణ సింధూ రెసిడెన్సీలో సిబిఐ అధికారులు ఆయన సమక్షంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వారు కీలక పత్రాలు, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయ సాయి రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. వైయస్ హయంలో ఆయన టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 74 మంది నిందితులుగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 17వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది.