సాయి రెడ్డి కస్టడీని వారం రోజులు పొడిగించాలి:సిబిఐ
Published on: Tue Jan 10, 2012 1:44PM
హైదరా
బాద్: జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని మరో వారం రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విజయ సాయి రెడ్డి తమ కస్టడీకి తీసుకున్న తరువాత మొదటి మూడు రోజులు పెదవి విప్పలేదని సిబిఐ చెప్పింది. విజయ సాయి రెడ్డి కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు ఆయనను మంగళవారం కోర్టు ముందు ప్రవేశపెట్టారు. తమ కస్టడీకి అప్పగించిన ఐదు రోజుల్లో విజయ సాయి రెడ్డి విచారణలో సహరించలేదని, చివరి రెండు రోజులు మాత్రమే కొన్ని వాస్తవాలు చెప్పారని, విజయ సాయి రెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి కీలక సూత్రధారి అని సిబిఐ అన్నది.కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితుల వివరాలను విజయ సాయి రెడ్డి నుంచి తెలుసుకోవాల్సి ఉందని సిబిఐ వాదించింది. విజయ సాయి రెడ్డిని అరెస్టు తర్వాత కొంత మంది ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారని తెలిపింది. విదేశీ ఆర్థిక లావాదేవీల వ్యవహారం కూడా విజయసాయి రెడ్డి నుంచి రాబట్టాల్సి ఉందని తెలిపింది. అనేక విషయాలపై విజయ సాయి రెడ్డిని విచారించాల్సి ఉందని చెప్పింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం లోగా వాదనలు ముగిశాయి.


