TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు బాలయ్య విలన్ బర్త్ డే

Published on: Wed Feb 12, 2014 8:43AM

 

25 సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోగా రాణిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు జగపతిబాబు పుట్టినరోజు నేడు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా హీరోలతో, దర్శకులతో మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించే మనస్తత్వం కలవాడు. ప్రస్తుతం ఆయన ప్రతినాయకుడిగా మరో కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "లెజెండ్" అనే చిత్రంలో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. నేడు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అంతే కాకుండా ప్రస్తుతం "పిల్లా నువ్వులేని జీవితం", "రారా కృష్ణయ్య" వంటి చిత్రాలలో మంచి పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

 

ఈ సందర్భంగా జగపతిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్