TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో జగన్‌ వచ్చి కలుస్తాడంటున్న విజయమ్మ!

Published on: Wed Aug 8, 2012 8:14AM

ఒకవైపు రాష్ట్రప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్మోహనరెడ్డి విషయంలో తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సిబిఐ చేతులు కట్టేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే జగన్‌ తన అనుయాయుల ద్వారా ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంథీకి పంపిన రాయబారం విజయవంతమైందని వార్తలు వస్తున్నాయి. ప్రధాని రేసులో ఉన్న రాహుల్‌గాంథీకి జగన్‌ మద్దతు ప్రకటించినందున దర్యాప్తు జోరు తగ్గించాల్సింగా సోనియా సిబిఐ, ఈడి అధికారలను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా కార్యక్రమాలు పెట్టుకోవటం లేదు. అయితే వైఎస్‌ఆర్‌ అనుచరుడు, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహావిష్కరణకు వచ్చిన వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి తమ పార్టీ శ్రేణులతో త్వరలో జగన్‌ వచ్చి కలుస్తాడు అని అంటున్నారు. ఎవరూ ఎదురు ప్రశ్నించే అవకాశం లేకుండా ఆమె ఈ మాటను నొక్కిచెప్పారు. అభిమానులందరినీ ఉత్సాహపరిచేందుకు మాత్రమే ఆమె చెప్పినట్లు లేదు. ఖాయంగా జగన్‌ బయటికి వస్తారన్న సంకేతాలను ఇచ్చినట్లుంది. రెండోవైపు పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి పెరగకుండా జగన్‌ వీలైనంత తొందరగా వచ్చేస్తారని విజయమ్మ ఆనందంగా చెప్పటం దానికి ఏర్పాట్లు పూర్తయ్యాయన్న నమ్మకాన్ని కలిగించిందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.