TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కుర్చీలో నల్లులు!

Published on: Fri Jul 26, 2024 6:48PM

జగన్ పెట్టక పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌ పక్కనే వున్న పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే, జగనన్న ఏదేదో సొల్లు అంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్‌తో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవీ వద్దు. మీరు మాత్రం రండి.. జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్‌మీట్‌లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు రెండు గంటలపాటు చెప్పీ చెప్పీ బుర్ర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగనన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు,  అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్‌ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా, ఆ ఫుటేజ్‌లో జగనన్నయ్య లీలలు లేకుండా వుంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్‌లో కూడా ట్రోలర్స్.కి, మీమర్స్.కి కావలసినంత ఫుటేజ్ వుంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్తకొత్త తెలుగు పదాలు వున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు వున్నాయి.

వీడియో సంగతి అలా వుంచితే, జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. ఇద్దరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే, జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితిని జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్టు ‘‘రెండు ప్రశ్నలు సర్’’ అని అడగటం ప్రారంభించగానే, జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న  నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్.ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు.. ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చిట్టచివరికి, ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.