TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ట్విట్టర్‌కి దిక్కూమొక్కూ లేదు...

Published on: Wed Mar 4, 2015 4:17PM

 

అయ్యలారా.. అమ్మలారా.. అక్కలారా.. చెల్లెళ్ళారా.. మీకు దణ్ణం పెడతాం.. మా జగనన్న ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి.. ప్లీజ్.. అని జనాన్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జగన్ మీడియాలో పనిచేస్తున్నవారికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, మొన్నీమధ్య జగన్ ప్రారంభించిన ట్విట్టర్ అకౌంట్‌కి ఫాలోవర్లు ప్రస్తుతం కొన్ని వేలల్లో మాత్రమే వున్నారు. ఇప్పటి వరకూ తన మీడియా ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నది చాలదన్నట్టు జగన్ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించి అందులో కూడా చంద్రబాబు నాయుడిని విమర్శించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జగన్ సార్ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించడం ఆలస్యం ప్రపంచ వ్యాప్తంగా వున్న లక్షలాది మంది ఆయన ఫ్యాన్స్ ఆయన అకౌంట్‌ని ఫాలో అవుతారని, అతి కొద్దికాలంలోనే లక్షలాది మంది ఫాలో అయిన రాజకీయ నాయకుడిగా జగన్ నిలిచిపోతారని జగన్‌తో పాటు ఆయన మద్దతుదారులు కూడా భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి సీట్లు ఎక్కువ రాకపోయినా ఓట్లు బాగా వచ్చాయని జగన్ వర్గం ప్రచారం చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా ట్విట్టర్లో చంద్రబాబు, లోకేష్ కంటే మా జగనే కింగ్ అని చెప్పుకునే ప్లాన్ వేశారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ఆ ప్లాన్ తుస్సుమంది. జగన్ ట్విట్టర్ అకౌంట్ మొదలుపెట్టి వారాలు గడిచిపోయినా ఫాలో అయినవాళ్ళు కేవలం వేలల్లోనే వున్నారు. దాంతో జగన్ పార్టీ వర్గాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.

 

జగన్ మీడియాలో పనిచేస్తున్న వారందరూ జగన్ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవడంతోపాటు తమకు తెలిసినవాళ్ళందరి చేతా జగన్ ట్విట్టర్ అకౌంట్‌ని ఫాలో అయ్యేలా చేయించాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. అలాగే జగన్ పార్టీకి చెందిన వారందరూ తమకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా కొత్తగా క్రియేట్ చేసుకుని అయినా జగనన్న అకౌంట్ని ఫాలో అవ్వాలని కూడా ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. అలాగే బ్రదర్ అనిల్ కుమార్ కూడా జగన్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్లను పెంచే విషయంలో తనవంతు కృషిని చేస్తున్నట్టు సమాచారం. ఇలా దిక్కూ మొక్కూ లేకుండా పోయిన జగన్ ట్విట్టర్ అకౌంట్‌ని పైకి లేపి నిలబెట్టడానికి ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తూ వున్నారు.