ఏపీ క్యాబినెట్ నుండి ఐదుగురు మంత్రులు అవుట్....జగన్ సంచలన నిర్ణయం ?

 

ఏపీ సీఎంగా బాద్యతలు చేపట్టిన జగన్మోన్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వెళ్తున్నారు. అవినీతి అనేదే లేకుండా చేయడమే తన లక్ష్యం అని చెబుతున్న ఆయన ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలకే కాక ఇంకా ఎపిక కూడా కాని వాలంటీర్లకి కూడా కాస్త గట్టిగానే చెప్పారు. అయితే జగన్ మాట వినకుండా ఏపీ మంత్రులు కొందరు ఇప్పటికే కోట్ల మేర అవినీతికి పాల్పడినట్టు చెబుతున్నారు. 

తమ తమ శాఖలలో ఎక్కడ అవినీతి చేస్తే బయటకి కనిపించకుండా ఉంటుందో అక్కడ అవినీతికి పాల్పడినట్టు జగన్ కి రిపోర్ట్స్ వచ్చాయని అంటున్నారు. ఆయన మంత్రి వర్గంలోని ఐదుగురు మంత్రులు అవినీతికి పాల్పడినట్లు సమాచారం జగన్ కి అందిందట. అయినా నిజానికి వీరి విషయంలో ఏంచేయాలో కూడా ఆయనకి అర్ధం కావడం లేదట. ఎందుకంటే ఆయన ఎవరి మీద అయినా చర్యలు తీసుకున్నట్టు అయితే అది ప్రపంచం అంతా తెలిసిపోతుంది. 

అలా కాదని వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశానని చెప్పిద్దామన్నా వారు ఒకరికి ఐదుగురు ఉండడంతో అది సాధ్యమయ్యే పని కాదు. అయినా సరే బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకుని తీరతానని చెబుతున్న జగన్ వారికు ఉద్వాసన పలకవచ్చని అంటున్నారు. అందులో ఒక మహిళా మంత్రి కూడా ఉండడం ఆశ్చర్యం కల్గించే విషయం. ఆమె మంత్రి అయిన నాటి నుండే భర్త అక్రమ దందాకు తెరలేపాడని అంటున్నారు. 

మరో సీనియర్ మంత్రి ఏమో తనకు జిల్లాలో ఎదురు లేదు అన్నట్టు వసూళ్ళకి పాల్పడుతున్నట్టు, ఇక మరో మంత్రి  ఒక విద్యాసంస్థ బ్యాన్ చేసి మళ్ళీ రీ ఓపెన్ చేసి అక్కడ డబ్బు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే వారికీ క్లాస్ తీసుకున్నా ప్రభుత్వం మీద జనానికి నమ్మకం కలగాలంటే వారిని తప్పించడమే సరయినపని అని ఆయన అనుకుంటున్నారట. అయితే అది అవినీతి చేశారని కాక ఆరోపణలు వచ్చేలా చేసి పోమ్మనకుండా పొగబెట్టెలా వారంతట వారినే రాజీనామా చేయమని కోరే అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం.