TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తోక వంకరే.. సోషల్ మీడియా ఉవాచ! 

Published on: Tue Jun 25, 2024 12:09PM

 ప్రజా స్వామ్య వ్యవస్థ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు.  గత ఐదేళ్ల క్రితం అబద్దపు ప్రచారంతో అధికారంలో వచ్చిన జగన్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అదే పంథాలో కొనసాగుతుంది. వై నాట్ 175 అని ప్రచారంలో దిగిన జగన్ కు ఎపి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఖరి మారలేదు. కుక్క తోక వంకర అని జగన్ మరో సారి రుజువు చేసుకున్నారు. పోటీ చేసిన అన్ని లోకసభ, అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన జనసేన ను అప్రతిష్ట పాలు చేయాలని వైఎస్ జగన్ కంకణం కట్టుకున్నారు. ఐ ప్యాక్ సలహాలు, సూచనలతో అరాచక ప్రభుత్వాన్ని చేపట్టిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఫేక్ యూట్యూబ్ చానల్స్ ద్వారా జనసేనాని మీద దుష్ ప్రచారానికి ఒడి గట్టుతున్నాయి. 
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అపోహలు సృష్టించేందుకు వైసీపీ పెద్ద కుట్రకు తెరలేపిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. జగన్‌రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న సోషల్ మీడియా పేజీలు, చానళ్లు పవన్ కల్యాణ్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. టీడీపీకి అనుకూలం అని నమ్మించేలా ‘యువగళం’ అనే యూట్యూబ్ చానల్‌ను ‘ఐప్యాక్’తో పెట్టించి, చంద్రబాబును తిడుతూ వీడియోలు పెట్టించారని పేర్కొంది. ఇప్పుడు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఫేక్ వీడియోలు పోస్టు చేసి రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించే పెద్ద కుట్రకు తెరలేపారని వివరించింది. 

యువగళం అనే యూట్యూబ్ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదని వివరణ ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినీ అభిమానుల మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి ఈ దేశంలో జగన్ ఒక్కడికే ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మవద్దని కోరింది. ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.