TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి కొత్తపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్

Published on: Wed Jun 1, 2022 9:31PM

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ క్రమశిక్షణా సంఘం సిఫారసు మేరకు కొత్త పల్లి సుబ్బారాయుడిని జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో ఉద్యమించిన కొత్తపల్లి వైసీపీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించినప్పటి నుంచీ పార్టీలో ఆయన ప్రాముఖ్యతను బాగా తగ్గించేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నరసాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఏ పార్టీ మద్దతూ అవసరం లేదనీ, తనకు వ్యక్తిగత ఇమేజ్ ఉందనీ చెప్పారు.

జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించిన తనపై ఏ-1 ముద్దాయిగా కేసు పెట్టడాన్ని ఖండించారు. కేసులకు భయపడే ప్రశక్తేలేని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలలోనే జగన్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.