జగన్‌కి కడుపు నొప్పి!
Published on: Tue Jul 9, 2024 2:21PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పదేళ్ళ తర్వాత సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్న చర్చలు చూసి జగన్మోహన్రెడ్డికి కడుపు ఉబ్బరం బాగా పెరిగిపోయిందని, ఆయన ఈ పరిణామాలు చూసి తట్టుకోలేక కడుపునొప్పితో బాధపడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత పదేళ్ళుగా తెలంగాణ అధికారంలో వున్న కేసీఆర్ గానీ, ఐదేళ్ళుగా కేసీఆర్‌తో రాసుకుని పూసుకుని తిరిగిన జగన్ గానీ, రెండు రాష్ట్రాల మధ్య వున్న విభజన వివాదాలను తొలగించే ప్రయత్నం చేయలేదని, ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుంటే చూసి తట్టుకోలేక జగన్ అండ్ కో విమర్శలు చేస్తున్నారని దేవినేని అన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేయడం ఇలాంటి కడుపునొప్పిలో భాగమేనని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.


