జగన్, షర్మిల ఆస్తుల గొడవ!.. ఇడుపులపాయలో రచ్చ రంభోలా!
Published on: Mon Dec 27, 2021 11:15AM
జగనన్నకు కోపం వచ్చింది. చెల్లి షర్మిలకు అంతకంటే ఎక్కువే కోపం వచ్చింది. ఇద్దరూ తగ్గేదే లే అన్నారు. తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. షర్మిల ఆ అర్థరాత్రే ఇడుపులపాయ వదిలి వచ్చేశారు. తల్లి విజయమ్మ తల్లడిల్లిపోయారు. క్రిస్‌మస్‌కు ముందురోజు రాత్రి.. ఇడుపులపాయ గెస్ట్‌హౌజ్‌లో అసలేం జరిగింది? అన్నాచెల్లిల్లు తీవ్రంగా ఘర్షణ పడ్డారా? ఆస్తి పంపకాలపై పంతానికి పోయారా? రాజకీయమూ తోడైందా? తల్లి సమక్షంలో జరిగిన ఓ ఫ్యామిలీ వార్ ఎలాంటి విపరీత పరిణామాలకు దారి తీస్తుంది? షర్మిల కోర్టు కెళ్లనుందా? జగన్ చెల్లిని టార్గెట్ చేయనున్నారా?
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది. ఇడుపులపాయ గెస్ట్ హౌజ్‌లో జగన్-షర్మిల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాటామాట బాగా పెరిగిందని అంటున్నారు. ఆస్థి పంపకాలే వారి మధ్య జగడానికి కారణమని చెబుతున్నారు. వైఎస్సార్ సంపాదనంతా జగన్‌కు, తనకు సమానంగా పంచాలనేది షర్మిల వాదన. ఆ పంపకాల విషయంలోనే గతంలోనే అన్నాచెల్లిల్లు గొడవపడి విడిపోయారు. షర్మిల మెట్టింటికి వెళ్లిపోయారు. క్రిస్మస్ కోసం పుట్టింటికి వెళ్లగా మరోసారి పెద్ద వివాదమే జరిగింది.
అన్నాచెల్లెళ్ల మధ్య మరోసారి ఆస్థి పంపకాల ప్రస్తావన వచ్చింది. తన వాటా తేల్చాలని షర్మిల పట్టుబట్టగా.. షర్మిల తీరు తనను ఇబ్బందులకు గురి చేస్తోందని జగన్ మండిపడ్డారట. వద్దు వద్దన్నా.. తెలంగాణలో పార్టీ పెట్టి తనకు తలనొప్పిగా మారావని.. తన మాట విననప్పుడు తానెందుకు ఆస్థిలో వాటా ఇవ్వాలని జగన్ రివర్స్ అటాక్ చేశారని తెలుస్తోంది. నాన్న సంపాదించిందేగా అడుగుతున్నది.. అందులో నాకు సమాన వాటా ఉంటుందిగా.. నా భాగం నాకు ఇచ్చేయాల్సిందేనని షర్మిల గట్టిగానే పట్టుపట్టారట. మొండిఘటం జగన్ అంత ఈజీగా ఒప్పుకుంటాడా.. నా మాట విననంత కాలం నీకు ఒక్క పైసా ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో పో.. అంటూ షర్మిలపై విరుచుకుపడ్డారని అంటున్నారు. షర్మిల సైతం ఏమాత్రం తగ్గకుండా.. నా వాటా నాకు ఎలా ఇవ్వవో నేనూ చూస్తా.. ఎలా రాబట్టుకోవాలో నాకూ తెలుసంటూ.. అప్పటికప్పుడు ఆ అర్థరాత్రి ఇడుపులపాయ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయారని తెలుస్తోంది.
అన్నాచెల్లిల గొడవంతా.. తల్లి విజయమ్మ సమక్షంలోనే జరగ్గా.. ఆమె మాత్రం ఎవరి పక్షాన ఉండాలో అర్థం కాక.. కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉన్నారట. కూతురు తగ్గేలా లేదు.. కొడుకు మాట వినడం లేదు.. ఆ తల్లికి బాధ ఆగడం లేదు.. ఇలా క్రిస్మస్ పండగ ముందు.. ఇడుపులపాయ ఎస్టేట్‌లో రచ్చ రంభోలా జరిగిందని సమాచారం.
గురువారం రాత్రి జరిగిన ఆ గొడవ ప్రభావం.. శుక్రవారం ఉదయం వైఎస్సార్ సమాధి దగ్గర నివాళులు అర్పించే విషయంలో స్పష్టంగా కనిపించింది. షర్మిల అక్కడ లేరు. జగన్ వేరేగా.. విజయమ్మ ఒంటరిగా.. వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. తండ్రి సమాధి సాక్షిగా.. ఆ కుటుంబం మూడు ముక్కలైందని అంటున్నారు. ఈ మూడు ముక్కలాట ఏ పాపానిదో....?


