TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఒకటన్నారు.. మరి విజయసాయి ఎన్నంటారో?

Published on: Fri May 23, 2025 7:37AM

రాజ్యసభ మాజీ  సభ్యుడు విజయసాయి రెడ్డిపై    వైసీపీ అధినేత, మాజీ  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ విజయసాయిని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఏపీలో కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. తన రాజ్యసభ సభ్యత్వం గడువు మరో మూడున్నర సంవత్సరాలు  మిగిలి ఉండగానే విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికేనన్న జగన్.. జయఃసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూటమికి అమ్మేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

వైసీపీ ఆవిర్భావం నుంచే కాకుండా అంతకు ముందు నుంచీ కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిపై జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విజయసాయి రెడ్డికి జగన్‌తో మూడు దశాబ్దాలకు పైగా  సన్నిహిత అనుబంధం ఉంది.   జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నారు.  అది పక్కన పెడితే.. ఒక దశలో వైసీపీలో జగన్ తరువాత నంబర్ 2గా ఉన్నవిజయసాయి ఆ పార్టీ నుంచి రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే రెండో టర్మ్ ఇంకా మిగిలి ఉండగానే ఈ ఏడాది జనవరిలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికీ, పార్టీకీ రాజీనామా చేశారు. అప్పట్లో విజయసాయి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నాననీ, రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. రాజకీయకు దూరంగా సాగు చేసుకుంటానని చెప్పారు.  

అయితే.. ఇప్పుడు జగన్ విజయసాయి రెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి రాజీనామా చేశారని  అలాంటి వ్యక్తి మాటలకు, స్టేట్‌మెంట్లకు ఏ విలువ ఉంటుంది ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ విజయసాయిరెడ్డి విశ్వసనీయత కోల్పోయారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే జగన్ వ్యాఖ్యలకు విజయసాయి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు  లిక్కర్ స్కాం  కేసులో విచారణకు హాజరైన విజయసాయి ఇచ్చిన సమాచారం అధారంగానే  నిందితుల అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు.  మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యం అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోన జగన్ గురువారం (మే 22) మీడియా సమావేశంలో విజయసాయిపై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసు తన వరకూరావడానికి విజయసాయే కారణమన్న ఆగ్రహంతోనే జగన్ ఈ స్థాయిలో స్పందించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో  తనను విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్ గా రియాక్టైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.