టీడీపీలో ఉండలేక.. వైసీపీకి వెళ్లలేక.. ఆనం తికమక.!!

ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి, ఉన్న పడవకి రంధ్రం పెట్టుకొని.. కొత్త పడవలో తగిన చోటు లేక, పాత పడవలో ఉండలేక అన్నట్టు తయారైంది.. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన ఆనం బ్రదర్స్.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు.. ఆనం వివేకానందరెడ్డి మరణాంతరం, ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ మీద అసంతృప్తితో వైసీపీలో చేరాలనుకున్నారు.. ఆ దిశగా ఆనం పావులు కూడా కదిపారు.. ఇక ఆనం రేపో మాపో వైసీపీలో చేరడం ఖాయం అనుకున్నారంతా.. కాని ఆనం ఆశలకు వైసీపీ గండి కొట్టినట్టు తెలుస్తుంది.. వైసీపీ ఆనం ను పార్టీలోకి ఆహ్వానిస్తుంది కాని ఎమ్మెల్యే సీట్ గురించి స్పష్టత ఇవ్వట్లేదు.. మరోవైపు మేకపాటి గౌతం రెడ్డి లాంటి నేతలు కూడా ఇలానే స్పందించారు.. పార్టీ లోకి ఎవరైనా రావొచ్చు కాని అందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని ఆనం ను ఉద్దేశించి అన్నారు.. దీంతో ఆనం ఆలోచనలో పడ్డారట.. వైసీపీలో చేరాక సీట్ ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందనే భావన ఆనంలో మొదలైనట్టు తెలుస్తోంది.. మొత్తానికి ఆనం టీడీపీలో ఉండలేక, వైసీపీలో చేరలేక తికమక పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.