TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నవ్యాంధ్ర అభివృద్ధి జాతర....చంద్రబాబు కలలకు జగన్ పాతర

Published on: Wed Apr 20, 2022 1:06PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం ఎవరికీ పట్టని బిడ్డ ఎక్కెక్కి ఏడ్చిందన్న చందంగా రెవెన్యూ లోటుతో....ఎడారిలో ఏకాకిగా మిగిలిన రాష్ట్రాన్ని నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి.....నిలబెట్టారు. తన దార్శనికతతో....సంపన్న రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  నిర్మాణం కోసం భూమి సమీకరణకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకూ ఎవరూ ఎన్నడూ చేయని రీతిలో ఆయన తలపెట్టిన భూ సమీకరణకు రైతుల నుంచి అపూర్వ స్పందన లభించింది. చంద్రబాబుపై నమ్మకంతో, రైతులు  దాదాపు 33వేల ఎకరాలను భూ సమీకరణ పద్ధతిలో ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో తనపై ప్రజా నమ్మకమే పెట్టుబడిగా....ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి నవ్యాంధ్రలో శ్రీకారం చుట్టారు.  ఇప్పటి అవసరాలే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఆదాయ వనరుగా అమరావతిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేశారు. సంక్షోభాన్ని సదవకాశంగా, సవాళ్లను  దీటుగా ఎదుర్కొన్న నేత చంద్రబాబు. 
అయితే ఆయన తరువాత అధికారంలోనకి వచ్చిన జగన్ సర్కార్ రాజకీయ కారణాలతో అమరావతి నిర్మాణాన్ని  మూడు ముక్కలాట పేరుతో మూలకు నెట్టేశారు. అయితే ఆయన తరువాత అధికార పగ్గాలు చేపట్టిన జగన్ తన విధానాలు, కక్షపూరిత వైఖరితో అభివృద్ధికి పాతర వేసే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. 

 ఆదాయ వనరులు లేని, రెవెన్యూలోటుతో ఆవిర్భవించిన రాష్ట్రాన్నిఏడాది వ్యవధిలోనే రెండం కెల వృద్ధికి తీసుకు వచ్చారు. చంద్రబాబు ఆర్థికాభివృద్ధితో సంపన్న రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగిన రాష్ట్రం ఇప్పటి ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రీలంక బాటలో పయనిస్తూ దివాళా అంచున నిలిచింది.
ఇక నవ్యాంధ్రకు జీవనాడిగా భావించే పోలవరం నిర్మాణంలోనూ ఆయన తనదైన వేగం, చొరవ చూపారు. కేంద్రం నుంచి మద్దతు లేకపోయినా, నిధులు అందకపోయినా వెనక్కు తగ్గలే. ఐదేళ్ల వ్యవధిలో దాదాపు 73శాతం నిర్మాణ పనులను పూర్తి చేయించారు. ఇందు కోసం పేద రాష్ట్రమే అయినా వెరవకుండా  నిధులు వెచ్చించారు. ప్రతి సోమవారం విధిగా పోలవరం సందర్శన యాత్ర చేసి పనులను పర్యవేక్షించారు. ఆయన స్వీయ పర్యవేక్షణ కారణంగా దేశంలో చివరి బహుళార్ధసాధక ప్రాజెక్టు అయిన పోలవరం దాదాపు పూర్తయ్యే స్థితికి వచ్చింది. అయితే తరువాత అధికారంలోనికి వచ్చిన వైసీపీ సర్కార్ పుణ్యమా అంటూ నిర్మాణ వేగం కుంటుపడింది.  పెరిగిన అంచనాల మేరకు వ్యయం భరించలేమంటూ.... పోరుగు రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గి పోలవరం ఎత్తును తగ్గించి రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు వైసీపీ సర్కార్ సిద్ధపడుతోంది.

పరిశ్రమలే లేని విభజిత ఆంధ్రప్రదేశ్ అధినేతగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలోనికి పెద్ద ఎత్తున పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటే స్టేట్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా దావోస్ ఆర్థిక సదస్సులో పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలిరావడానికి దోహదం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక కియారా కార్ల తయారీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందంటే అందుకు చంద్రబాబు చొరవు, శ్రమే కారణం.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా  హైదరాబాద్ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందడానికి కారకుడై చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి, విశాఖలలో ఐటీ పరశ్రమలకు కేంద్రాలు మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయన కార్యాచరణతో మంగళగిరి హైదరాబాద్ కు దీటుగా ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా అడుగులు పడ్డాయి. పలు స్టార్టప్ లు తమ కార్యకలపాలను ప్రారంభించాయి. అయితే కొత్త ప్రభుత్వం తీరుతో ఆ పరిశ్రమలన్నీ వెనక్కు మళ్లాయి. 
ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని పాలనను ప్రజలకు చేరువ చేయడానికి చంద్రబాబు వినియోగించుకున్న తీరు ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలను అందుకుంది. చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రజాసమస్యలను నేరుగా ఎప్పటికప్పుడు స్వయంగ పర్యవేక్షించేందుకు వీలు కల్పించింది. రాష్ట్రంలో ఏ మూల కరెంట్ పోయినా వెంటనే డ్యాష్ బోర్డులో తెలసపోయేలా సాంకేతిక పరిజ్ణానాన్ని  పాలనను మెరుగు పరచేందకు చంద్రబాబు వినియోగించుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు...ఇలా ఒకటేమటి....ప్రజాసమస్యలన్నిటిపైనా  వెంటవెంటనే పరిష్కరించేందుకు రియల్ టైమ్ గవర్నెన్స్ సాంకేతిక దన్ను ఇచ్చింది.

ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పందేరాలతో రాష్ట్రాన్ని దివాళా దిశగా నడుపుతుంటే....ఎనిమిదేళ్ల కిందటే చంద్రబాబు పేదలకు ఉచితంగా సొమ్ము ముట్ట చెప్పడం కాదు....సంపాదించుకునేందుకు ఉపాధి మార్గాలు చూపాలన్న ఉద్దేశంతో పథకాలకు రూపకల్పన చేశారు. అభివృద్ధి ద్వారా పెరిగి సంపద ఫలాలు అట్టడుగు వర్గాలకుఅందినప్పుడే నిజమైన అభివృద్ధి అని నమ్మి ఆ దిశగా ముందుకు సాగారు. ఆ కారణంగానే గ్రామీణ, పట్టణ ప్రాంతలన్న బేధం లేకుండా విభజత ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పుష్కలంగా పనులు దొరికాయి. పరిశ్రమలు కళకళలాడాయి. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. జగన్ రెడ్డి విధానాల కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఇసుక విధానం కారణంగా నిర్మాణ రంగం కుదేలైంది. వ్యవసాయ రంగం నర్వీర్యమైంది.  బాబు హయాంలో అభివృద్ధి పరుగులు పెడితే జగన్ హయాంలో తిరోగమన దిశలో పయనిస్తున్నది.

రాజకీయంగా చంద్రబాబుతో విభేదించా వారు కూడా అభివృద్ధి విషయంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని అంగీకరిస్తారు.  అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలే కాదు...ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడే వధంగా అభివృద్ధి ఫలాలు అర్హులకు అందడం. చంద్రబాబు టెన్యూర్ లో అదే జరిగింది.