విజయమ్మను అలా వేడుకున్న జగనన్న!
Published on: Mon Apr 4, 2022 12:51PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ... తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారని సమాచారం. ఇదే విషయాన్ని తన కుమారుడు, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వెల్లడించగా.. ఫ్యాన్ పార్టీ ప్లీనరీ సమావేశాల వరకు ఆగాలంటూ కన్నతల్లి విజయమ్మకు సీఎం జగన్ టైమ్ ఇచ్చినట్లు.. ఇటు లోటస్ పాండ్‌తోపాటు అటు తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా ఓ టాక్ అయితే మస్త్ మస్త్‌గా వైరల్ అవుతోంది.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఆయనకు ఆయన తల్లి వైయస్ విజమయ్మతోపాటు ఆయన చెల్లి వైయస్ షర్మిలకు మధ్య చాలా గాప్ వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసేందే. ఈ నేపథ్యంలో.. వారిరువురు పక్క రాష్ట్రానికి వెళ్లడమే కాదు.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ.. వైయస్ షర్మిల.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ఓ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను పరామర్శిస్తూ... ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తూ.. రాష్ట్రంలోని ప్రజా సమస్యల తెలుసుకునేందుకు ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిందీ వైయస్ షర్మల. అయితే షర్మిల వెంటే.. ఆమె తల్లి వైయస్ విజయమ్మ కూడా ఉంటున్నారు. దాంతో ఆమె... వైయస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ పదవికి రాజీనామా చేయాలని వైయస్ విజమయ్మ నిర్ణయించి.. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు తెలుపగా.. ఆయనపై విధంగా ఆమెకు టైమ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ పదవికి విజయమ్మ రాజీనామా చేస్తే.. ఆ పదవి ఎవరికి ఇస్తారంటూ ఓ చర్చ అయితే తాడేపల్లి ప్యాలెస్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ రెడ్డి పేరు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పార్టీ ప్లీనరీ అనంతరం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైయస్ భారతీ రెడ్డి బాధ్యతలు చేపడతారని సమాచారం.
మరోవైపు 2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యారంటే.. అదీ వైయస్ జగన్ ఒక్కడే పడ్డ కష్టమేమి కాదని.. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆయన సోదరి వైయస్ షర్మిల జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేయడం.. అలాగే జగన్ బావా బ్రదర్ అనిల్ తెరచాటు రాజకీయంతోపాటు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. వ్యూహారచన కూడా తోడు అయిందని ఓ చర్చ అయితే ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా నడుస్తోంది. ఆ క్రమంలోనే ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి రానున్నది ఎన్నికల సీజన్.. అలాంటిది.. వచ్చే ఎన్నికల్లో తల్లి చెల్లి లేకుండా.. వైయస్ జగన్ అండ్ కో ప్రజల్లోకి వెళ్లితే.. వారంతా జగన్ వైపు నిలబడతారా?.. ఆయన మాటలను విశ్వసిస్తారా? ఆయన పార్టీకి ఓట్లు వేస్తారా? అంటే సందేహమే అనే సమాధానం.. ప్రజల నుంచి వస్తోంది. 2019 ఎన్నికల వేళ .. రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ ప్రచారం చేసి.. ఆ తర్వాత.. రాజన్న భార్య విజయమ్మ, రాజన్న కుమార్తె వైయస్ షర్మిలలను దూరం పెట్టిన జగన్ మాటలను ప్రజలు నమ్ముతారా? అంటే ఏమో సందేహమేననే సమాధానం ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలే నుంచే వస్తోంది.
గత ఎన్నికల వేళ.. మాట తప్పం.. మడమ తిప్పం అని చెప్పి.. ఓట్లు అడిగినా వైయస్ జగన్... కన్న తల్లి వైయస్ విజయమ్మ.. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి వదులుకున్న తర్వాత.. జగన్‌తోపాటు ఆయన భార్య భారతీలు ఏ ఫోటో పట్టుకుని ప్రజల్లోకి వెళ్తారనే ఓ చర్చ అయితే తెలుగు ప్రజల్లో అంతర్గతంగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. రానున్న ఎన్నికల వేళ.. జగన్ అండ్ కోతోపాటు.. ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటనే ఓ ప్రశ్న అయితే .. ఫ్యాన్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరి మనస్సును తొలుస్తోంది.


